Tuesday, October 13, 2009

స్నేహాo

అడగదు ఏమిటి కులమని స్నేహం,
చూడదు ఏ మతమని స్నేహం,
కోరుతుంది తనవారి హృదయములో స్థానాన్ని,
దాని కోసం లెక్క చెయ్యదు ప్రాణాన్ని,
గడిచిపోతే తిరిగి రాదు మనంకోసం,
వో తియ్యని అనుభవం స్నేహం,
మరిచిపోతే అది తిరిగి కల్లలీనే ,
సుఖ సంతోషాల నిలయం స్నేహం,
పోతే తిరిగి కాదది మన సొంతం,
కడవరకు విడిపోని బంధం స్నేహం,
మరువలేని మరుమల్లె స్నేహం,
తియ్య తియ్యని అనుభవాల ,
అందమైన జీవితం,అనుబంధాల సంగమం స్నేహం............
ఎన్ని జన్మలకైనా ఇలాగే .......................
అని నమ్మే నిజమైన స్నేహాన్ని నేను.............!!!!!!

ఒకే ఒక మాట:

మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు...

కలవడానికి చేతులవసరం లేదు
కలసిన ఇరువురి స్వచ్చమైన భావాలు చాలు
మాటలు అంత కంటే అవసరం లేదు
మన ఇద్దరి మధ్య క్షణ కాల మౌనం చాలు
ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి,
మనసుని దోచుకోవటానికి
నన్ను చేరడానికి కాళ్ళు అవసరం లేదు
నీ హృదయం లో నా తలపు చాలు
నాగురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలియడానికి
చేరువలో లేకున్నా, ప్రేమను పంచడం లో ఆప్యాయతను పంచడం లో
నువ్వు ఎప్పుడు నా చెంత నుంటా వని నా మనసుకు తెలుసు
ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు