Tuesday, December 28, 2010

స్నేహం

ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయంపడే తపనే ప్రేమ అదే చుక్కనే రానివాకుండా ఆరాటపడే హృదయమే స్నేహం

Monday, September 13, 2010

ప్రియతమా... ప్రియతమా...

ప్రియతమా... ప్రియతమా...

నువ్వు వచ్చి నన్నేదో చేసావూ...

వింతగా మారిపోయానిపుడు...

గాలిలో తేలిపొయేటపుడు...

అంత హాయి నువ్వే కలిగించావు...

ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...

Sunday, September 5, 2010

ఈ చిన్ని గుండెకి సంతృప్తినిచ్చే ఆ ఆలోచన చాలు…

కలవడానికి చేతులవసరం లేదు
కలసిన ఇరువురి స్వచ్చమైన భావాలు చాలు
మాటలు అంత కంటే అవసరం లేదు
మన ఇద్దరి మధ్య క్షణ కాల మౌనం చాలు
ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి,
మనసుని దోచుకోవటానికి
నన్ను చేరడానికి కాళ్ళు అవసరం లేదు
నీ హృదయం లో నా తలపు చాలు
నాగురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలియడానికి
చేరువలో లేకున్నా, ప్రేమను పంచడం లో ఆప్యాయతను పంచడం లో
నువ్వు ఎప్పుడు నా చెంత నుంటా వని నా మనసుకు తెలుసు
ఈ చిన్ని గుండెకి సంతృప్తినిచ్చే ఆ ఆలోచన చాలు

స్నేహం!!

పరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను !!!
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి …
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను….
నీ జీవితంలో ప్రతి విజయానికి
నీ వాళ్ళంతా గర్వించి నప్పుడు కాస్తంత విచ్చుకొనే నీ
పెదవుల నుండి రాలిపడే పూవులోని తావి నేనవుతాను….
నా పేరే స్నేహం!!

నువ్వే నువ్వే

నువ్వే…
నా ప్రతికధలికలోను నువ్వే…
నా ప్రతి శ్వాస, ధ్యాసలోను నువ్వే…
నా హృదయాన్తరంగ లయల్లోను నువ్వే…
నా గుప్పెడు గుండె చప్పుడులోను నువ్వే….
నా తలపుల బావనలలోను నువ్వే…
నా భావానికి అక్షర రూపంలోను నువ్వే….
నువ్వే నువ్వే నా మనసు స్మరణలో నువ్వే…

నువ్వు నువ్వు నువ్వే నువ్వు…

నీ గురించి ఆలోచించని నిముషం లేదు…
నీ ఊహల రచన చేయని క్షణం లేదు…
నీ మృదు మధురమైన మాటలను తలచని రోజు లేదు…
నీ మీద నాకున్న ప్రేమకి ఆది అంతము లేనే లేదు…
నీ తలపుల వర్ణ నలకు జరిగిన, జరుగుతున్న కాలంతో పని లేదు…

ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి…..

మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో…
మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో…
ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో…
చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు
నేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే
కలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన
అర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా
కాసింత చోటు కల్పించవూ….
ఎవరి మనస్సులో రహస్యాలు,అవగాహనలు సమనంగా ఉంటాయో వారి స్నేహం ఎప్పుడూ క్షీణించదు.
ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు.
ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి…..