Tuesday, October 13, 2009

స్నేహాo

అడగదు ఏమిటి కులమని స్నేహం,
చూడదు ఏ మతమని స్నేహం,
కోరుతుంది తనవారి హృదయములో స్థానాన్ని,
దాని కోసం లెక్క చెయ్యదు ప్రాణాన్ని,
గడిచిపోతే తిరిగి రాదు మనంకోసం,
వో తియ్యని అనుభవం స్నేహం,
మరిచిపోతే అది తిరిగి కల్లలీనే ,
సుఖ సంతోషాల నిలయం స్నేహం,
పోతే తిరిగి కాదది మన సొంతం,
కడవరకు విడిపోని బంధం స్నేహం,
మరువలేని మరుమల్లె స్నేహం,
తియ్య తియ్యని అనుభవాల ,
అందమైన జీవితం,అనుబంధాల సంగమం స్నేహం............
ఎన్ని జన్మలకైనా ఇలాగే .......................
అని నమ్మే నిజమైన స్నేహాన్ని నేను.............!!!!!!

ఒకే ఒక మాట:

మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు...

కలవడానికి చేతులవసరం లేదు
కలసిన ఇరువురి స్వచ్చమైన భావాలు చాలు
మాటలు అంత కంటే అవసరం లేదు
మన ఇద్దరి మధ్య క్షణ కాల మౌనం చాలు
ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి,
మనసుని దోచుకోవటానికి
నన్ను చేరడానికి కాళ్ళు అవసరం లేదు
నీ హృదయం లో నా తలపు చాలు
నాగురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలియడానికి
చేరువలో లేకున్నా, ప్రేమను పంచడం లో ఆప్యాయతను పంచడం లో
నువ్వు ఎప్పుడు నా చెంత నుంటా వని నా మనసుకు తెలుసు
ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు

Saturday, September 26, 2009

ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి.....

మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...

మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...

ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...

చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు
నేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే
కలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన
అర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడా
కాసింత చోటు కల్పించవూ....

ఎవరి మనస్సులో రహస్యాలు,అవగాహనలు సమనంగా ఉంటాయో వారి స్నేహం ఎప్పుడూ క్షీణించదు.
ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు.
ఆనందం అంటే నీవు ఆనందించడంతో పాటు ఎదుటి వారికి ఆనందం ఉండాలి.....
నీ అద్బుతపాదాలనంటుకొని రాలిపోయిన దుమ్ము కూడా ప్రకాశవంతమే.నీ వెలుగు చిమ్మే కళ్ళల్లోకి నే చూడలేక వంగి నిలుచుంటాను.కానీ… విచిత్రంగా నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి, నన్ను నిలువరిస్తాయి…చివరికి స్వప్నంలో కూడా నన్ను చూడవస్తాయి.
♫ నా కళ్ళు ఏమని భాషిస్తున్నాయో ,నీకేం తెలుసు?నీ కళ్ళనడుగు.నా హృదయం నీకెంత సన్నిహితమో నీకేం తెలుసు?నీ హృదయాన్నడుగు.

నా హృదయాన్ని దారానికి గుచ్చి వెతుకుతున్నాను,నిన్ను అలంకరిద్దామని..ఎంతకూ కనిపించవేం?

నీ చక్కని చల్లని చేతి స్పర్ష కమ్మగా నైనా,కఠినం గానైనా,కలలో నైనా,నా చెంపను తాకితే..ఊహకు అందని ఆ అనుభూతిని ఏమని వర్ణించను...

నాలోని హృదయం నాదా నీదా అని సందేహమొచ్చింది! ఎందుకంటే... అది నాకంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తోందే..

చిరంజీవిగా ఈ ప్రేమ...

ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను...ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ

అమ్రుతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనం తో వుంటుంది
అందరిని తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ...

మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]...ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ...

స్నేహం

ప్రాణ స్నేహం అంటే నమ్మకం లేదు నాకు. ప్రాణమివ్వగలను అనుకోను నేను. ఇంకొకరు నాకోసం ప్రాణం ఇవ్వడం అన్న ఆలోచన దుర్భరం. ఎందరో ప్రాణాల త్యాగాల వల్లే మన ప్రాణాలు నిలుస్తున్నాయి అనుకోండి. అది వేరే విషయం.

స్నేహం ఒక అందమైన వరం.
స్వంత వారు స్నేహంగా ఉండచ్చు.
స్నేహితులు సంబంధీకులూ అవ్వచ్చు.
కానీ స్నేహమొక్కటే ఉన్న సంబంధంలో ఏదో సంతోషముంది.

ఏమీ ఆశించని స్నేహం నాకిష్టం.
కలిసినప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకోవడం నాకిష్టం.

అందనంత దూరంలో ఉన్నా,
ఆనంద సమయంలో
తన వారు తక్కువని కాదు,
తను కూడా ఉంటే బాగుండును
అనిపించే భావం స్నేహం

మౌన భాష నాకు రాదు

కళ్ళకు కబుర్లు చెప్పకు నేస్తం
మౌన భాష నాకు రాదు
అలా నవ్వుతూ.. అర్థాలు వెతుక మనకు నేస్తం
వేదాలు నాకూ అర్థం కావూ..!!!

కావాలనే కలలు కంటాను

కావాలనే కలలు కంటాను
నీవు కనిపిస్తావేమోనని.

నిశ్శబ్దాన్నీవింటాను
వినిపిస్తుందని నీ పిలుపు.

ఆశకు కొదవేముంది
ఆకాశంలో చుక్కల్లా.....?

చేసే స్నేహం మరవకు...

వద్దన్నా వచ్చేది మరణం
పోవదన్నా పోయేది ప్రాణం
తిరిగి రానిది బాల్యం
మరువలెనిది నా ఈ నేస్తం
కిరణానికి చీకటి లేదు.........
సిరిమువ్వకి మౌనం లేదు...........
చిరునవ్వుకి మరణంలేదు.....
మన స్నేహనికి అంతంలేదు.....
మరిచే స్నేహం చెయ్యకు......... చేసే స్నేహం మరవకు

జీవితపు తెరలలో..తీపి గురుతుల కాగితం మన స్నేహాం..

జీవితపు తెరలలో..తీపి గురుతుల కాగితం మన స్నేహాం..
నీలి ఆకాశపు నీడలో...మన పరుగులు..
చిలిపి అల్లర్లు...చిన్ని చిన్ని కలహాలు...
మరుక్షణం కలయికలు..మన స్నేహాపు రోజులు...
జీవిత రహదారిలో..మరోసారి ఆ మైలురాయిని తాకగలమా??

మన స్నేహామే ముద్దు.......

ఆచరణలు లేని ఆలోచనలు మనకొద్దు...
అంతేలేని ఆ నింగే మన హద్దు..
మన జీవితాలతో చెలగటమాడే...
ఈ ప్రేమలు మనకొద్దు...
కమ్మని కలలను చూపే కనులకి...
కన్నిళ్ళు నేర్పే ఈ ప్రేమ మనకొద్దు...
మన అంతరంగాలని పంచుకునే...
మన స్నేహామే ముద్దు.......

మన " స్నేహం "...

నిద్రలో " స్వప్నం "...
నింగిలో " నక్షత్రం "...
నీటీలో " పుష్పం "...
ఈ భువిలో మన " స్నేహం "...

ఎందాక..???

మేఘం ప్రయాణం చినుకు కురిసేదాక..
మెరుపు ప్రాయాణం వెలుగు మెరిసేదాక..
పరుగు ప్రయాణం గమ్యం చేరేదాక..
చూపు ప్రయాణం కనులను కలిసేదాక..
వలపు ప్రయాణం మనసులు కలెసేదాక..
మరి మన చెలిమి ప్రయాణం ఎందాక..???

పెదాలకి మౌనం కావాలి ...

ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానినొకటి చూసుకోవు.
ఎప్పుడు కలిసే ఉండే పెదాలు
ఒక్క మాటలో విడిపోతాయి.
అందుకే ...
కళ్ళకి ధ్యానం కావాలి
పెదాలకి మౌనం కావాలి ...

నేస్తమా...

నా ప్రియ నేస్తమా...
నా చూపు నీ కోసం ఎదురు చూస్తుంది
నీ కోసం తపిస్తుంది
నా ప్రతి ఆశ...
నువ్వు గొప్ప వ్యక్తివి కావాలని
నా తుది శ్వాసా వదిలే వరకు
నిన్ను మరవను...
నీ కోసం తపిస్తున్న...
ఈ స్నేహాన్నీ మరువకు నేస్తం...

बहुत याद आते हो ...

बहुत याद आते हो ...
टुकड़े-टुकड़े दिन बीता, धज्जी-धज्जी रात मिली
जितना-जितना आँचल था, उतनी ही सौगात मिली
रिमझिम-रिमझिम बूँदों में, ज़हर भी है और अमृत भी
आँखें हँस दीं दिल रोया, यह अच्छी बरसात मिली
जब चाहा दिल को समझें, हँसने की आवाज सुनी
जैसे कोई कहता हो, ले फिर तुझको मात मिली
मातें कैसी घातें क्या, चलते रहना आठ पहर
दिल-सा साथी जब पाया, बेचैनी भी साथ मिली
होंठों तक आते आते, जाने कितने रूप भरे
जलती-बुझती आँखों में,सादा सी जो बात मिली .......
कैसे हो ?
बहुत याद आते हो ...

ప్రేమ తో నీ ప్రియమైన ఆత్మీయ నేస్తం...

ఉదయించే సుర్యుడి కన్నా...
వికసించే పుష్పం కన్నా...
చిరుగాలి సవ్వడి కన్నా...
సెలయేరు పరవల్లు కన్న...
చిరుజల్లుల చప్పుడు కన్నా...
అస్తమించే సంధ్య కన్నా...
మురిపించే పౌర్ణమి కన్నా...

నేస్తమా "నీ చిరునవ్వుకై నే వేచివున్నా..."

ప్రేమ తో నీ ప్రియమైన ఆత్మీయ నేస్తం...

ఇదేరా జీవితం దీన్ని అనుభవించు అనుక్షణం..!!!

మనసు లోని భావాలెన్నొ... మరువలేని గాయలెన్నో...
వీడలేని నేస్తాలెన్నో...
వీడిపోని బంధాలెన్నో...
మరపురాని పాటలెన్నో...
మధురమైన క్షణాలెన్నో...
కవ్వించే కబుర్లెన్నో...
మాయమయ్యే మార్పులెన్నో...
అవసరానికి వాదిన అబ్బద్దలెన్నో...
తుంటరిగా చెసిన చిలిపి పనులెన్నొ..
అశ్చర్యపరిచే అద్భుతలెన్నో...
మాటల్లొ చెపలెని ముచట్లెన్నో...
ముసుగువేసిన మనస్సుకు మరువరాని గ్నాపకాలెన్నో...
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో............ మనిషి జీవితంలో మరువలేనివి మరెన్నో...............
ఇదేరా జీవితం దీన్ని అనుభవించు అనుక్షణం..!!!

జీవితం ......

లేత ఆకుపై మంచు బిందువు
సూర్యునికి కిరణాలకు కరిగి
ప్రకృతి ఆకర్షణకు ఒరిగిపొయే జీవితం...
నిన్నటి నిరాశపై రేపటి ఆశ పెంచుకొని
వర్ధమాన కాలాన్ని లెక్కేసి భవిష్యత్ ని
భద్రపరుచుకొనే జీవితం...
ఆవేశం అంచుపై ఆలోచన పదును పెట్టి
కార్యానికి శ్రీకారం చుట్టి
అభివృద్డిని ఆకాంక్షించేది జీవితం...
మూసిన పిడికిలి
తెరచిన తలుపులు ఎగిరే కెరటాలు
రంగుల కలల్ని నింపే జీవితం ......

*****అమ్మ****

ఆది గురువు అమ్మ
అనురాగానికి ప్రతీక అమ్మ
చైతన్యానికి ప్రతీక అమ్మ
ఒక చల్లని సమీరం అమ్మ
నవమాసాలు మోసి కనేది అమ్మ
శిశువు పలికే తొలి పలుకు అమ్మ
నడక నేర్పించేది అమ్మ
నాగరికతను చూపించేది అమ్మ
గుండె సవ్వడి గుర్తించేది అమ్మ
నవ్వుల పూలు పూయించేది అమ్మ
గలగల పారే సెలయేరు అమ్మ
వాడిపోని పరిమళ సుమధురం అమ్మ
అమ్మలేని ప్రపంచం నిస్సారం , నిర్జీవం....

స్నేహం...

స్నేహం అనేది ఎంతో నిర్మలమైనది
దానికిలేవు కులం, మతం భాషా భేదం
మనసు మనస్సుకు మధురమైన భావాలు
నెమరు వేసు కొనేదే ఈ స్నేహం
నీవు,నేను అనే తార తమ్యాలు లేవు
స్నేహంలో.....
అనుకోని సంఘటనలు ఎదురై కాలం
కాటేసినపుడు....శారీరక బలం
సన్నగిల్లినపుడు ,అయోనియా, గందరగోళంలో
నీవు కొట్టుకెల్లు తున్నపుడు ఆదుకోరు నీభందువులు
అదుకొనేది స్నేహమొక్కటే
ఆనందపు అంచులలో నాట్యం చేసేది స్నేహం...

చిరునవ్వు చిందిస్తావా...

చిరునవ్వు చిందిస్తావా
చితినుంచైనా బతికివస్థా
మరుజన్మకైనా కరునిస్తావా
మరుక్షణమె మరణిస్తా


Still needs to be continued ...

మన స్నేహం

చిగురించే ఆశలకు
చిగురించిన ఆశయాల సాధనకు
చిరకాలం తోడుండేది స్నేహం
చిరకాలం గుర్తుండేది స్నేహం
కలకాలం మనవెంటే
మన మనసున వుండే
మరువనిదే స్నేహం
వారే మన నిజమిన నేస్తం
మీరు నిదురించిన క్షణాన
నిన్ను తలచెను నా నెస్తం
మీ స్నెహం అందరికి ఆదర్శం
మనది 3 నెలల స్నేహం
కొనసాగాలి ఇది కలకాలం....

कल हो ना हो ...

आज एक बार सबसे मुस्करा के बात करो
बिताये हुये पलों को साथ साथ याद करो
क्या पता कल चेहरे को मुस्कुराना
और दिमाग को पुराने पल याद हो ना हो

आज एक बार फ़िर पुरानी बातो मे खो जाओ
आज एक बार फ़िर पुरानी यादो मे डूब जाओ
क्या पता कल ये बाते
और ये यादें हो ना हो

आज एक बार मन्दिर हो आओ
पुजा कर के प्रसाद भी चढाओ
क्या पता कल के कलयुग मे
भगवान पर लोगों की श्रद्धा हो ना हो

बारीश मे आज खुब भीगो
झुम झुम के बचपन की तरह नाचो
क्या पता बीते हुये बचपन की तरह
कल ये बारीश भी हो ना हो

आज हर काम खूब दिल लगा कर करो
उसे तय समय से पहले पुरा करो
क्या पता आज की तरह
कल बाजुओं मे ताकत हो ना हो

आज एक बार चैन की नीन्द सो जाओ
आज कोई अच्छा सा सपना भी देखो
क्या पता कल जिन्दगी मे चैन
और आखों मे कोई सपना हो ना हो

क्या पता
कल हो ना हो ....

ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధమే..!

కదలిపోయే కెరటంలా
సాగిపోయే నావలాంటి నా జీవితాంలో
ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా
పలకరించిన మిత్రమా..

అరుణోదయ సంధ్య లోగిలిలో
సుఖ దు:ఖాల జీవిత సంగమంలో
చివరకు మిగిలేది మిగిలేది మితృలే
మరో సూర్యుడు నాకోసం ఉదయిస్తే..
నేను మరో జన్మలో మనిషిగా జన్మిస్తే,
నీలాంటి స్నేహితురాలి మమతానురాగాల కోసం
ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధమే..!

మనసుకి తెలీదా ఒక చిరు కలయిక

మనసుకి తెలీదా ఒక చిరు కలయిక,
చెప్పలెధా ఆది ఎటు వంటి కలయికో,
తల్లిగా కాదా చెల్లిగా కాదా ,
లేక మనసుకి నచ్చినా మాధుర్య
చిరు స్నేహితురలే కాదా.

అధియ్యేమీ భావానో కలిగిన తరువాత,
చెరగని, మారని ,మాధుర్యానుభూతి ఏ,
కదా చిన్ని చిన్ని అబద్దాలు
ఒక్కోసారి మనసుకి కలిగిస్తాయి,
చిరు గిలిగింత మన్శుకే తెలియని,
ఒక పులకింత చెప్పగలవా నేస్తామా!!

నా నవ్వే నాకు ప్రాణం
నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటాను
అలానే నవ్విస్తూ నే ఉండాలని ఆశిస్తూ ఉంటాను.!!
తెలియని మనసుకి రాని భావం ఉండునా,
కలిగిన ఆ ప్రతి భావనా ఇలలో కలఏన
జరగదని తెలియదా ఓ చిన్ని మనసు
మనసుకి చాలా భావాలు, తెలియనివి,
కొన్ని ఉన్న, తెలిసినవే ఎన్నో కదా .!!!

అని ఎలా చెప్పగలను నా మనసు లోని వేదన,
తెలిసినా తెలియని ఒక సన్నని ధారగా,
ఊగిసలాదే ఈ చిన్ని జీవితానికి కావలనా,
ఇన్ని ఆలోచనలు చెప్పాలని ఉన్న ఎలా
తెలుప గలదు తన మనసు తనకే అని,!!!!

ఆశల వేగాన్ని అందుకోలేని నేను
కావ్యాన్ని అందుకో గలనా
సెలయేటి గల గల లో వినిపించే నాదాన్ని వేగాన్ని
చూడగలనా కనిపించే ఒక చిన్ని భవనా నీకు ఇడియే వందనం.!!!
నేస్తమా అని పలుకరించే హృదయం నీకు వుంటే, నీ నేస్తానికి నేను చిరకాలం తోడుంటా.........

నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను,
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విఛి మ్రోస్తాను,
నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను,
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను,

సకల జగతిని శాస్వతంగా వసంతం వరియించుదాకా,
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాక,
పాత పాటను పాడలేను, కొత్త బాటను వీడిపోను,
నేను సైతం నేను సైతం నేను సైతం (sirivennela)
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....

1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు. గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి, రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు. ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు"...

చెలీ ఎంత వరకు...? నీ రాకకై...

నీ తలపుల తారలెన్నో
నా హృదయాకాశం లో...

నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...

రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...

నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...

భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే
ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...

నీ కలలతో, తలపులతో, విరహంతో
ఈ క్షణం నిలిచిపోని...

కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...? నీ రాకకై...

ఫ్రేమ...

ఫ్రేమ గొప్పదే!!కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది...ప్రేమను ప్రదర్శించడానికి ముందు జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి...ఎప్పుడూ ఒకరి గురించి ఆలోచించడం ప్రేమ కాదు...మానసికంగా అలసిపొయినప్పుడు గుర్తుకు రావడం ప్రేమ...ఆ గుర్తు రావడంలో హయే ప్రేమ... Keep a green tree in your heart and perhaps a singing bird will come. It is better to die with memories than to live with only dreams. Sometimes love is for a moment
sometimes love is for a lifetime. Sometimes a moment is a lifetime.

Friday, September 25, 2009

నువ్వు మిగిల్చిన ఏకాంతంలో

నువ్వు మిగిల్చిన ఏకాంతంలో, నీవు పేర్చిన జ్ఞాపకాల
అరలని శోధిస్తున్నా.. అక్కడైనా నీ సన్నిధి దొరుకుతుందేమోనని..
నువ్వు విదిల్చిన ఒంటరితనంలో, నీవు మరచిన ఊసుల
దొంతరలని చేధిస్తున్నా.. అక్కడైనా నీ ఊహల నిధి చేజిక్కుతుందేమోనని..

నీవు మిగిల్చిన నిశ్శబ్ధపు నీరవంలో, నీవు విహరించిన కలల కైమోడ్పులైన
చక్షువులని తెరవలేకున్నా.. ఎక్కడ నీ రూపం మాయమవుతుందేమోనని..
నీవు విదిల్చిన అశ్రు తిమిరంలో, నీకై ఎగసిన అలలకై అరమోడ్పులయిన
గవాక్షాలని మూయలేకున్నా.. ఎన్నడైనా నీ అడుగు నా ఎదలోకి ప్రవేశితమౌతుందేమోనని..

ఒంటరితనం

మనసులో బాధ సుడులు తిరిగింది.
గుండె గొంతుకులో కొట్టుకుంటోంది.
పెగలలేని మాట మూగబోయింది.
కనులలో నీరు పెల్లుబుకింది.
లోలోని వేదన అణచుకోలేను.
అలాగని ఎవరితో పంచుకోలేను.
అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిని నేను.
ఎవరికీ నేను ఏమీ కాను.

మాట్లాడవేం మిత్రమా ...!

మాట్లాడవేం మిత్రమా ...!
మనం మారుతున్నమా ,మాట మరుస్తున్నమా
మనం ఎమారుతున్నమా , మన మనసుని ఎమారుస్తున్నావా
మాట్లాడవేం మిత్రమా...!
ఉరకలేసే ఉత్సాహంలో ఏమిటి ఉదాసీనత
నేస్తామన్న పిలుపులో ఏమిటి నిర్లిప్తత
స్నేహం విలువ తగ్గుతుందా
స్నేహితుల స్థానం మారిపోతుందా
మాట్లాడవేం మిత్రమా...!
కలుసుకోవటానికి ఒక్క కారణమైన చెప్పుకోలేదు
మరి విడిపోటానికి ఈ రోజు ఇన్ని వంకల
రతనాలని రాసులుగా పోసి అమ్మారని చెప్పుకున్నాం
మనుషులు మిత్రులుగా ఉండేవారని చెప్పుకుంటామా
విడిపోవటం ఇంత సులువని ఎప్పుడు చెప్పలేదేం నేస్తం
స్నేహమంటే నిఘంటువు చూసి అర్ధం చూసి చెప్పే రోజు వచ్చిందన ....
మాట్లాడవేం మిత్రమా...!
నా ప్రేమ స్వచమైనధైతే
నీవెందుకు నాకు !!!
నీ జ్ఞాపకం చాలు !!!
జ్ఞాపకం ఏదైనా అనుభూతులు మిగిలిపోతాయి
అచ్చం నీ పరిచయం లాగా !!!!!!!!!!!!
ఎంత కాలమని ఎదురు చుసిన ఎదురు కాని నీ కోసం
అను నిత్యం నా వెన్నంటి ఉన్న క్షణాలని సైతం మరిచిపోయాను
ప్రతి ఊహలోను నిండి పోయిన నిన్ను మరువలేకున్నాను
నీకు దూరంగా ..... ఒంటరితనానికి దగ్గరగా ..
నీ కోసం ఎదురు చూస్తూ ..........
ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు
ప్రేమంటే పెదాలు సైతం పలకలేని భావాలు
నా ఊహలు నిన్ను కలవరపెడితే చెప్పు--కన్నీరై కరిగి వస్తాను
నా ఊసులు నిన్ను కట్టి పడేస్తే చెప్పు -కలవరమై నిన్ను కదిలిస్తాను
నను చూడటానికి నీ కంటికి కోపమైతే చెప్పు--చిరిజల్లై కురిసి పోతాను
నీ ఆధారాలు నాపై ఆగ్రహిస్తే చెప్పూ --చిరునవ్వై విరభుస్తాను
నా తలపులతో నీ గొంతు మూగభోతే చెప్పు-- చిరు పాటై రావలిస్తాను
నా వలపులు నీ మనసుకు భారమైతే చెప్పు--చిరుగాలిలో కలిసి దురమైపోతను !!!!!!!!!!!!!!!
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి
కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూపించాలని ...
ఊపిరిలోనికి వస్తున్నప్పుడు
నువ్వు నా లోనికి ప్రవేశిస్తున్న అనుభవమై హృదయం పొంగుతోంది శ్వాస బయటకి వస్తుంటే
నువ్వు వేల్లిపోతున్నావన్న బాధతో హృదయం భారమవుతుంది
ఈ ఉచ్వాస నిశ్వాసలో కూడా నీవే నిండి ఉన్నావన్న ఆనందంతో గుండె నిండుతోంది
నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ
నీవు లేని క్షణాలను గడుపుతున్నా .........
నీవు నా చెంత ఉంటే తప్ప మాటలు దరి చేరవు
నీవు దురం అయితే నీ ఆలోచనలతో సమయము తెలియదు !!!
నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం
నా పయనపు గాయం నీ స్నేహం
నా పలుకుల అర్ధం నీ స్నేహం
నా అడుగుల శబ్దం నీ స్నేహం
నా ఆశల అందం నీ స్నేహం
అలాంటి నీ స్నేహానికి నే దూరం కాలేను
ఆ విరహాన్ని నే భరించలేను !!!
విశ్వమంత చోటు ఏల ?? నీ పక్కన ఇరుకు స్థలముండగా !!!
పగలంతా నీ ప్రతి రూపాన్ని పలకరిస్తూ
రాత్రంతా నీ రూపాన్ని కలవరిస్తూ
....................ఇదే నా దినచర్య !!!!!
గులాబీ పువ్వు లాంటి అందమైన నవ్వు
నీ పెదాలపై చిరకాలం ఉండాలని ఆశిస్తూ .......
కలల ప్రయాణం మెలకువ వరకు
అలల ప్రయాణం తీరం వరకు
ప్రేమ ప్రయాణం వరకు
స్నేహ ప్రయాణం జీవితాంతం వరకు!!!
నీ చుట్టూ కటిక చీకటి
అనుక్షణం స్పందించే గోడలు
ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉందని
ఏ మాత్రం భయ పడవద్దు
నీవు సురక్షితమైన ప్రదేశం లోనే ఉన్నావు
అది నా హృదయం !!!!!!!!!!!!!!!!!!!
క్షణమొక యుగమని ఎలా అనగలను
నిన్ను తలవక క్షణమైనా లేనప్పుడు !!!!!!
నేస్తం !! నేనున్నది కేవలం నీ కోసం
ఉన్నదిక్కడే ఓ ఎద సవ్వడి దూరంలోనే
నీవు స్పందించే ప్రతి నిముషం
నీ హృదయాన్ని తాకుతూనే ఉంటాను
నీవు నిదురోయే వేల నీ కలలలో
తిరుగాడుతూనే ఉంటాను....
ఏమిటి మన మధ్య ఇంతటి సాన్నిహిత్యం
స్రిష్టికర్త సైతం సరిపోల్చలేని బంధం కాదా ఇది ...??
సరిపోల్చుతనందువా ..? సరే నీ ఇష్టం
చిరునవ్వుననకు కన్నీటితో కను మరుగు అవుతాను
ఆశననకు నిరాశగా మిగిలిపోతాను
స్వసననకు నిస్వసనై సదలిపోతాను
స్వప్నమనకు రవి రాకతో మాయమవుతాను
నీడను అనకు చీకటిలో కలసిపోతాను
మరి ఏమనమందువా ..!!!
నువ్వు నేనను .. నేను నువ్వను ...
నువ్వు నేను ఒకటను ....!
నువ్వు రమ్మంటే రాజ్యాలు వదిలి రానా
నీ చిరునవ్వు కోసం స్వర్గాన్ని విడిచి రానా!!!
ప్రకృతి లోని పంచభూతాల సాక్షిగా
సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా
పువ్వు లోని మకరందం సాక్షిగా
మైమరిచి పాడే కోకిల సాక్షిగా
నిన్ను ఇష్టపడే చంద్రుని సాక్షిగా
నేను నీ దానిని ..........
నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా !!!!
నిను వీడి వెళ్ళిపోతున్న
కానీ నీ చెంతే నా మనసుని వదిలిపోతున్న
నీవు లేక ...నిదుర లేక
మనసు లేక మమత లేక
ఎంత కాలమో ఈ జీవన యానం
కదలలేక ...మెదల లేక
కలలురాక కలుసుకోక
ఎందుకోసమో ఈ జీవనరాగం
దినమొక యుగముగా
తనువొక సగముగా
ఎన్నాళ్ళో ఈ అంధకారం
ఎప్పుడో ఎక్కడో సుప్రభాతం
నిన్ను తొలి సారి చుసిన క్షణం కోసం....
నీ రూపం మరువలేని నా కనులని అడుగు ...
నీ జ్ఞాపకాల కోసం....
తలుచుకోని క్షణమంటూ లేని కాలాన్ని అడుగు...
నీ పై ప్రేమ
మదిలో వెల కట్టలేని నీ రూపాన్ని అడుగు...
నీ పై ప్రేమ కోసం..
మదిలోని వెలకట్టలేని నీ రూపాన్ని అడుగు..
నిను ప్రేమించిన కాలం కోసం ...
కడసారిగా కనుమూసిన క్షణాన నా హృదయాన్ని అడుగు..
ఎలా అడిగిన .. ఏమని అడిగిన....
మదిలో కొలువైన రూపం చెరిగిపోదు ..
వేరొక రూపం దరి చేరదు ....
నీ నవ్వు చూస్తూ జీవితాంతం నరకంలో ఉండగలను
నువ్వు లేక క్షణమైనా స్వర్గంలో ఉండలేను
కలలోనైనా కచ్చితంగా వస్తానని చేతిలో చెయ్యి వెయ్యి
వెయ్యి వత్సరాలు
ఆ కమ్మని నమ్మకంతో
ఆదమరచి నిదురిస్తాను
నా జీవితం అనే కధకు మూలం నీవే
అది నీ రాకతో మొదలవుతుంది
నువ్వు వెళ్ళిపోతే ముగుస్తుంది
అందులో ప్రతి పదము నీవే
ప్రతి పాఠం పేరు నీ పేరే
ప్రతి వాక్యము నీతోనే మొదలు
నిన్ను కోరుకొనేది క్షణాల సుఖం కోసం కాదు !!!!!!!!!!!
జీవితాంతం తోడు కోసం !!!!!!!!
అందరికి సూర్యుడి రాకతో శుభోదయం
నా జీవితానికి నీ రాకతో మహోదయం
కదిలే ప్రతి క్షణం లో నువ్వు ఉన్నావు
వేసే ప్రతి అడుగులో నువ్వు ఉన్నావు
మెదిలే ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు
మిగిలే ప్రతి అనుభవం లో నువ్వు ఉన్నావు
వచ్చే ప్రతి రుతువులో నువ్వు ఉన్నావు
పూచే ప్రతి పువ్వులో నువ్వు ఉన్నావు
మొత్తంగా నా లోనే నువ్వు ఉన్నావు.....!
ఎదలో కదిలే భావం, మదిలో మెదిలే గానం
అనుక్షణం నీ ధ్యానము , అర్పిస్తా నీకే నా ప్రాణము
వేసవిలో వెన్నెల వర్షం కురుస్తుందా
నీ ఊహల్లో విహరించందే నా రోజు గడుస్తుందా ....
నీతో గడిచిన క్షణాలను మర్చిపోలేను
నీవు నాతో లేని క్షణాలను ఊహించలేను
నేను కోరుకొనేది ప్రతి క్షణం నీతో గడపాలని ............
నువ్వు నాకు గుర్తొస్తే ఎవరు ఉండరు ,నీ జ్ఞాపకం తప్ప !!!
నువ్వు నా పక్కన ఉంటె , అసలు నేనే ఉండను నువ్వు తప్ప
కాలం నా ప్రేమకు శాపం కాదు
వేచి ఉంటాను
నీ ప్రేమను గెలుచుకుంటాను

ప్రయాణం

వీచే గాలిలో
జోరుగ సాగే ఈ రైలు
వూపేస్తోంది నన్నేనా?
పుస్తకంలో మునిగిన
మిమ్మల్ని కూడానా?
అతిగా కాచే ఎండలో
గతి తప్పిన ఈ ఎడారి ఓడ
తీరని దాహం నాకేనా?
దిక్కులు చూస్తోన్న
మీకు కూడానా?

ప్రాణ స్నేహం

స్నేహం అంటే నమ్మకం లేదు నాకు. ప్రాణమివ్వగలను అనుకోను నేను. ఇంకొకరు నాకోసం ప్రాణం ఇవ్వడం అన్న ఆలోచన దుర్భరం. ఎందరో ప్రాణాల త్యాగాల వల్లే మన ప్రాణాలు నిలుస్తున్నాయి అనుకోండి. అది వేరే విషయం.

స్నేహం ఒక అందమైన వరం.
స్వంత వారు స్నేహంగా ఉండచ్చు.
స్నేహితులు సంబంధీకులూ అవ్వచ్చు.
కానీ స్నేహమొక్కటే ఉన్న సంబంధంలో ఏదో సంతోషముంది.

ఏమీ ఆశించని స్నేహం నాకిష్టం.
కలిసినప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకోవడం నాకిష్టం.

అందనంత దూరంలో ఉన్నా,
ఆనంద సమయంలో
తన వారు తక్కువని కాదు,
తను కూడా ఉంటే బాగుండును
అనిపించే భావం స్నేహం

నీ ప్రేమకై

రాతిరంతా స్వప్నలోకంలో తిరుగుతుంటాను...దూరమెళ్ళిన నేస్తమో దగ్గరైన బందమో ఎవరో గానీ నన్ను చేరి దారి పొడవున తోడు వస్తారు...హాయి పూలను ఏరుకుంటూ గుండె గంపను నింపుకుంటూ రేయి ముగిసే వేళలోన కలలసంద్రపుటొడ్డుకి చేరుకుంటాను...అంతదాకా చెంతనున్న వారు కాస్త నన్ను వీడి వెళ్ళిపోతారు...గంపనేమో నేల దించి తడి తడిమిన ఇసుకమీద దాచుకున్న పూలతో అనుభూతుల ముగ్గులేసి మురిసిపోతాను...ఏ దుష్ట హస్తమో మరే వికృత వాలమో తెగిపడ్డ అలలాగ కవ్విస్తూ కబళించి వెళ్ళిపోతుంది...నా కలలను చెరిపేసి నన్నేమో వేకువ ముంగిట వదిలేసి మాయమౌతుంది...
నీ ప్రేమకై... కోటి ఊహలను ఊపిరిగా చేసుకుని...లక్ష ఆశలను రేపటిలో చూసుకుని...వేయి ఊసులను గుండెల్లో దాచుకుని...వంద జన్మలను వారధిగా చేసుకుని...నిన్ను మాత్రమే ప్రియతమగ తలచుకుని...బ్రతుకుతున్నాను నీ ప్రేమకై...

నా గురించి ఆలోచించినా

బస్సు గురించో, దారి గురించో
ఆట గురించో, పాట గురించో
పువ్వు గురించో, నవ్వు గురించో
ఆలోచిస్తావు గానీ
నా గురించి ఒక్క సెకనులో
వేయ్యోవంతు ఆలోచించినా
చాలదా ఈ జన్మ సార్థకం అవడానికి

స్నేహం

కన్నులు కలలను మరచిపోదు
ఊపిరి శ్వాసను మరచిపోదు
వెన్నెల చంద్రుడిని మరచిపోదు
నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు

నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు

నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు

వెన్నెల వెలుగులో
వాన చినుకుల్లో
సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి

దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను

ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని...